శ్లోకం : ఓం కార రీంగ్ కార పంచాక్షరతి సదాఅక్షరవాసి , అష్టాక్షరవాసి , సప్తలోకనాయకి , అష్ట ఐశ్వర్య దాయకి నవ శక్తి స్వరూపిణి , దశ భుజా దేవి ఏకాoకి చిలుక ద్వాదశి ప్రియే, పౌర్ణ ముఖ జ్వాలిని, అమావాస్య ప్రియే, ఓం ఐం గ్లౌం శ్రీ తిరుక్కన్ మహా సింహ వారాహి అంబాళ్ నమః !
శ్రీ తిరుక్కన్ సింహ వారాహి అమ్మవారి దేవస్థానం ఉపాసకర్ తపోపీఠం, జొన్నబండ వారాహీ హిల్స్ శక్తిగణేశ్ నగర్ అల్వాల్ హిల్స్ సికింద్రాబాద్… రండి.. అమ్మవారిని నిబద్ధతతో.. భక్తి శ్రద్ధలతో విశేషంగా పూజించి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి…శ్రీ వారాహీ దేవి ఆది పరాశక్తి రూపాల్లో పరమోత్కృష్ట అవతారం.సప్త మాతృకలు అయినటువంటి.. బ్రాహ్మి. మాహేశ్వరి..కౌమారి.. వైష్ణవి..వారాహీ..ఇంద్రాణి.. చాముండీ..శక్తిదేవతలలో విశిష్ట శక్తిదేవత. దశమహా విద్యలకు అధిదేవత.విష్ణువు వరాహ అవతారo కనుక వారాహీ మాత ను విష్ణువు సోదరిగా కీర్తిస్తారు. శ్రీ మహావిష్ణుని వరాహరూపం ఆత్మ శక్తి వారాహీ దేవి.అందువలననే వరాహ ముఖం కలిగివుంటుంది.శ్రీ రాజరాజేశ్వరి పరాంబిక తరువాత అంతటి మహిమాన్విత శక్తి గా అవతరించి మంత్రిణి దండినులలో శ్రీ పరమేశ్వరికి దండనాయికైన శ్రీ వారాహీదేవి వరాహచక్రం అనే దివ్య రథాన్ని అధిరోహించి..వరాహ ముఖం కలిగి చతుర్భుజాలతో…చిద్ఘనము..సద్రూపము.. హలము. ముసలము.. లను ఆయుధాలుగా ధరించి..మరో రెండు హస్తములతో అభయవరద ముద్రలతో దర్శనమిస్తుంది.శ్రీ లాలితాపరమేశ్వరి సేన అయినటువటవంటి శక్తిగణములకు ఈ దేవి అధినేత్రి..వారాహీ దేవి శత్రు నిగ్రహకారిణి.. వారాహీ దేవి స్తోత్ర పఠనం వలన సర్వ దుఃఖములు నశించును.స్వప్న ఫలములు బోధించును.శ్రీ వారాహీ దేవిని మనసులో తలచినంతనే శత్రువులు నిగ్రహింపబడతారు.భక్తులకు ఎనలేని శుభాలను అనుగ్రహించే వరప్రదాయిని.భక్తుల పట్ల ఎల్లప్పుడూ కరుణాకటాక్షాలను ప్రసరించే కరుణామయి..కోరిన కోర్కెలను శీఘ్రముగా నెరవేర్చే క్షిప్రప్రసాదిని. తన భక్తులకు ఎటువంటి విఘ్నాలూ ఆపదలూ కలగకుండా కాపాడే జగజ్జనని..పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడ్ని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి.ఆ వరాహమూర్తి స్త్రీతత్వమే వారాహీ..దేవీ భాగవతం మార్కండేయ పురాణాలలో వారాహీ ప్రసక్తి ఉంది.అంధకాసురుడు రక్తబీజుడు శుమ్భ నిశుమ్భ రాక్షసులను సంహరించడంలో వారాహీ పాత్ర సుస్పష్టంగా ఉంటుంది. వారాహీ రూపం వరాహమూర్తిని పోలివుంటుంది.నల్లని మేఘవర్ణ శరీర ఛాయ. వరాహ ముఖం తో ఎనిమిది చేతులతో అభయ వరద హస్తాలతో శంఖం చక్రం పాశం హలం వంటి ఆయుధాలు ధరించి ఉంటుంది.గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాలమీద సంచరిస్తుంది….తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహీ మాత. అందుకే ఈ శక్తిమాతను రాత్రివేళల్లో పూజిస్తుంటారు.కొన్ని ఆలయాలలో తెల్లవారు ఝామున రాత్రివేళల్లో మాత్రమే దర్శనం ఉంటుంది.దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారాహీ మాత ఆలయాలున్నాయి..ఒడిశా వారణాశి తంజావూరు చెన్నై మైలాపూర్ తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ జొన్నబండ శక్తిగణేష్ నగర్ ఓల్డ్ అల్వాల్ వారాహీ హిల్స్ లో విశేష ఆలయాలున్నాయి..శ్రీవారాహీ దేవి ప్రస్తావన లలిత సహస్రనామం లో ఉంది … సికింద్రాబాద్ జొన్నబండ శక్తి గణేష్ నగర్ ఓల్డ్ అల్వాల్ వారాహీ హిల్స్ ప్రాంతం లో కొలువై ఉన్న.శ్రీ తిరుక్కన్ మహా వారాహీ అమ్మవారు మహిమాన్విత శక్తి స్వరూపిణి..ఈ ఆలయాన్ని ఇటీవలే అభివృద్ధి చేస్తున్నారు.. ప్రస్తుతం చిన్న ఆలయo గా గోచరిస్తున్నప్పటికీ ఇక్కడి అమ్మవారు పరిహార దేవతగా భాసిల్లుతూ నమ్మి కొలచినవారి కోరికలు తీరుస్తూ కష్టాలు.. శత్రుబాధలు..ఈతిబాధలు. అనారోగ్యసమస్యలు ..ఆర్థిక బాధలు . ఇలా అన్నింటినీ తొలగిస్తూ అభయప్రదాయినిగా క్షిప్రప్రసాదినిగా పూజలందుకుంటోంది.ఈ ఆలయం లో భక్తులు నక్షత్ర శాంతి కి 27 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటారు. ప్రతి పౌర్ణమి రోజున రుద్ర, చండీ ..ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు.శుక్రవారం విశేష అభిషేకాలు అలంకరణలు చేస్తారు. ఈ ఆలయ విశిష్టతలు:: ఆదిపరాశక్తి త్రిశక్తి స్వరూపిణి. ఇచ్చాశక్తి.. జ్ఞానశక్తి .. క్రియాశక్తిని అనుగ్రహించే పరమోతృష్ట దైవం. అమ్మవారి త్రిశక్తి క్షేత్రాలు తమిళనాడులో కలవు.1. మెంజోరు లో తిరువుడై క్షేత్రం లో మంగళరూపిణిగా కొలువై ఇచ్చాశక్తిని అనుగ్రహిస్తోంది.2..తిరువత్తూరులో వడివుడై క్షేత్రం లో సౌందర్యశోభితంగా విరాజిల్లుతూ జ్ఞానశక్తి ని అనుగ్రహిస్తోంది.3..ఆవడి లో కొడిఇడై క్షేత్రం లో మెరుపుతీగలా నాజూకుగా ప్రకాశిస్తూ క్రియాశక్తిని అనుగ్రహిస్తోంది..ఈ త్రిశక్తి క్షేత్రాలను ఎవరైతే చైత్ర పౌర్ణమి రోజున ఒకేసారి దర్శిస్తారో వారికి కాశీ..రామేశ్వరం పుణ్యక్షేత్రాలను.. ఒకేరోజున దర్శించినంత పుణ్యఫలం సిద్ధిస్తుంది అని ప్రతీతి..అందుకే.ఈ ఆలయ వ్యవస్థాపకులు.. ఉపాసకులు స్వయంగా ఈ మహిమాన్విత త్రిశక్తి క్షేత్రాల నుంచి ..అలాగే దక్షిణ కైలాసం గా ప్రసిద్ధిచెందిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం నుంచి సేకరించిన పవిత్ర మట్టితో..23 పుణ్య నదులనుంచి తెచ్చిన పవిత్ర జలం తో సికింద్రాబాద్ జొన్నబండ వారాహీ హిల్స్ శక్తి గణేష్ నగర్ ఓల్డ్ అల్వాల్ గుట్ట మీద ఆహ్లాద వాతవరణం..మనోహరమైన పరిసరాల నడుమ నెలకొల్పబడిన విశేష పరిహార పవిత్ర మందిరం..అష్టమసిద్ధి దేవాలయం..శ్రీ తిరుక్కన్ మహావారాహీ మాత ఆలయం..తమిళనాడులోని ఈమూడు క్షేత్రాలను దర్శించుకోలేని వారు ఈ ఆలయాన్ని దర్శించి యధాశక్తి భక్తి శ్రద్ధలతో వేడుకుంటే చాలు ఈ త్రిశక్తి క్షేత్రాలను దర్శించినంత పుణ్యఫలితం కలుగుతుంది..ఈ ఆలయ వ్యవస్థాపకులు ఉపాసకులు వారియొక్క విశేష తపోశక్తి తో ప్రాణప్రతిష్ఠ కావించిన అమ్మవారి మహిమాన్విత శక్తిపీఠం ఇది. ఈ పంచాయతన క్షేత్రంలో ఒకటిన్నర అడుగుల ఎత్తుతో కృష్ణవర్ణ శిలామూర్తిగా దశభుజాలతో..10హస్తాలలో వివిధ ఆయుధాలు ధరించి విశాల నేత్రాలతో వరాహవదనంతో నక్షత్రపీఠం మీద సింహవాహనాన్ని అధిరోహించి పుష్పమాలికలతో సర్వాలంకార శోభితంగా మకరతోరణ సహితంగా ప్రసన్నంగా దర్శనమిస్తుంది.శ్రీ తిరుక్కన్ మహావరాహీ మాత..ఈ చిరు గర్భాలయం లో శ్రీచక్రం..శివుడు.. నారాయణుడు . విఘ్నేశ్వరుడు.. కుమారస్వామి.. సహితంగా కొలువై విశేష అభిషేక.. అర్చనాది పూజలు అందుకుంటూ భక్తుల అభీష్టాలను నెరవేరుస్తోంది. శత్రుబాధలు..నక్షత్ర దోషాలు.. గ్రహదోషా లు..నరఘోష…….అనారోగ్యాలు…..తొలగించుకోవడానికి వివాహప్రాప్తికి …….సత్సంతాన ప్రాప్తికి ..ఉన్నత విద్యా ప్రాప్తికి.. ఉన్నతఉద్యోగ ప్రాప్తికి..స్వగృహ ప్రాప్తికి ఈ అమ్మవారికి చేసే ప్రదక్షిణలు. మండల దీక్ష. ఆరాధన .. పూజ..అర్చన… అభిషేకాలు. హోమాలు..విశేష ఫలితాలనిస్తాయి .శ్రీ తిరుక్కన్.మహా వారాహీ అమ్మవారి ఆలయ దర్శనం ..సకల దోష నివారకం..సర్వకార్య సిద్ధిదాయకం……సమస్త శత్రు నిర్మూలనం..ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించవలసిన సంకల్పసిద్ధి ఆలయం..శ్రీ తిరుక్కన్ మహా వారాహీ ఆలయం… ఆలయ వ్యవస్థాపకులు.. ధర్మకర్త..ప్రొఫెసర్.Dr. నరేన్ చక్రవర్తి గారు..ఆలయ పర్యవేక్షకురాలు సీహెచ్. శైలజ గారు.. వెబ్సైట్.. www.Varaahimata.org..భక్తులకు మనవి:: శ్రీ తిరుక్కన్ మహా వారాహీ అమ్మవారి ఆలయం లో ఇప్పటివరకూ 250 పౌర్ణమి అమావాస్య విశేష హోమాలు దిగ్విజయంగా అద్భుతమైన రీతిలో నిర్వహించబడినాయి..అపురూపమైన ఈ అష్టమసిద్ధి ఆలయ అభివృద్ధి పుణ్యకార్యక్రమం లో భక్తులకు కూడా అవకాశం అనుగ్రహిస్తుంది అమ్మవారు.ఇక్కడ నిర్మాణదశలో ఉన్న యాగశాలకు గోశాలకు ఆలయ విస్తరణకు భక్తులు యథాశక్తి ధన.. కనక ..వస్తు.రూపేణా సమర్పించుకోవచ్చు..అలాగే నిత్య సేవ అభిషేక అర్చన హోమాదికాలకు నిర్దేశించిన పైకం చెల్లించి అమ్మవారి సేవలో తరించి వారాహీ మాత కృపకు పాత్రులు కాగలరు..జై శ్రీ తిరుక్కన్ మహా వారాహీ మాత..
Sri Thirukkan Maha Simha Varaahi Ambaal Devasthanam, Upasakar Thapo Peetam, H.No: 1-5-534/2 /98, Sri Varaahi Hills, Shakthi Ganesh Nagar, Jonnabanda, Old Alwal – 500010, Secunderabad, Telangana.
Sri Thirukkan Maha Varaahi Matha is Supreme parashakthi power Adhipathya Devatha for DasaMathas and Vidyas, the 5th Goddess among the Saptha Maatrukaas Brahmi,Maheswari, Koumari, Vaishnavi, Varaahi,Indrani, Chamunda Matha.Varaahi is also worshipped as Dandanayaki, also as Narayani sister to Lord Narayana she represents the aathma Shakthi of Lord Narayana which is very powerful. Varaahi Sanskrit: वाराही, Vārāhī is one of the Matrikas, a group of Seven mother Goddesses in the Hindu religion. With the head of geta sow, Varaahi is the shakti (feminine energy) of Varaha, the boar Avatar of the god Vishnu.
Varaahi is worshipped by four major practices of Hinduism : Shaivism (devotees of Shiva), Brahmanism (devotees of Brahma), Vaishnavism (devotees of Vishnu) and especially Shaktism (goddess worship). She is usually worshipped at night, using secretive Vamamarga Tantric practices.
According to Hindu legends Shumbha-Nishumbha myth of the Devi Mahatmya from the Markandeya Purana religious texts, the Matrikas goddesses appears as shaktis (feminine powers) from the bodies of the gods. The scriptures say that Varaahi was created from Varaha. She has a boar form, wields a chakra (discus) and fights with a sword. After the battle described in the scripture, the Matrikas dance – drunk on their victim’s blood.
The goddess Durga leads the eight Matrikas in battle against the demon Raktabija. The red-skinned Varaahi rides a buffalo and holds a sword, shield and goad. Folio from a Devi Mahatmya According to a latter episode of the Devi Mahatmya that deals with the killing of the demon Raktabija, the warrior-goddess Durga creates the Matrikas from herself and with their help slaughters the demon army. When the demon Shumbha challenges Durga to single combat, she absorbs the Matrikas into herself. In the Vamana Purana, the Matrikas arise from different parts of the Divine Mother Chandika; Varaahi arises from Chandika’s back.
The Markendeya Purana praises Varaahi as a granter of boons and the regent of the Northern direction, in a hymn where the Matrikas are declared as the protectors of the directions. In another instance in the same Purana, she is described as riding a buffalo,other vaahanaas like Lion, Tiger, Garuda . The Devi Bhagavata Purana says Varaahi, with the other Matrikas, is created by the Supreme Mother. The Mother promises the gods that the Matrikas will fight demons when needed. In the Raktabija episode, Varaahi is described as having a boar form, fighting demons with her tusks while seated on a preta (corpse).
In the Varaha Purana, the story of Raktabija is retold, but here each of Matrikas appears from the body of another Matrika. Varaahi appears seated on Shesha-nāga (the serpent on which the god Vishnu sleeps) from the posterior of Vaishnavi, the Shakti of Vishnu.
The Matsya Purana tells a different story of the origin of Varaahi. Varaahi, with other Matrikas, is created by Shiva to help him kill the demon Andhakasura, who has the ability – like Raktabija – to regenerate from his dripping blood.
🙏🏻Spiritual Importance of this Temple is that it is built with Divine Sand of Sri Kalahasthi which is also called as Dakshina kailasam, and Trishakthi kshetras in Tamilnadu in Minjur as Thiruvudai Matha which represents Iccha Shakthi , in Thiruvottiyur as Vadivudai Matha which represents the Gyana Shakthi (wisdom), and in Avadi as Kodieedai Matha which represents kriya Shakthi , one who visits this Trishakthi kshetras on pournami equals to gaining punya on visiting Kasi and Rameswaram on the same day which is very sacred and it fulfills their wishes People who cannot go so far in getting Darshanam can visit this Sri Thirukkan Maha Simha Varaahi Ammavari Astamasiddhi Temple which represents the Trishakthi kshetras,and with 23 punya , (jeevanadhi) River waters for Ammavari Abhishekam Rituals have been performed which represents for shanti parihara of 12 raashis in Astrology (associated Dosham), Devotees are advised to do 27 pradakshinas for Nakshatra Shanti and also it helps to get rid of any Malefic effects of Navagrahas, and Offer lemon 🍋 mala with 27 lemons as Garland to Devi Matha for Goddess Divine grace upon you.🙏🏻